ఆయుధ పూజలో సీపీ దంపతులు | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజలో సీపీ దంపతులు

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

ఆయుధ పూజలో సీపీ దంపతులు వైభవంగా బతుకమ్మ సంబరాలు బ్యాలెట్‌ బాక్సులకు రంగులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో సోమ వారం పోలీసులు ఆయుధ పూజ నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మహార్నవమి రోజు నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, అన్ని విభా గాల్లో ఆయుధాలకు పూజలు చేస్తారు. సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో జరిగిన ఆయుధ పూజలో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.తిరుమ లేశ్వరరెడ్డి, షిరీన్‌బేగం, కె.జి.వి.సరిత, కృష్ణ ప్రసన్న, ఎ.బి.టి.ఎస్‌.ఉదయరాణి, బి.సత్య నారాయణ, ఏఆర్‌ ఏడీసీపీ ఎన్‌.వి.రమణ, పలువురు ఏసీపీలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు: మడలంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారు చేసి ఆట, పాటల మధ్య సందడి చేస్తున్నారు. సోమవారం రాత్రి పెనుగంచిప్రోలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, లింగగూడెం, అనిగండ్లపాడు గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ఈ నెల 21వ తేదీన నుంచి పరిషత్‌ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మూల నపడిన బ్యాలెట్‌ బాక్సులను బయటి తీసి రంగులతో ముస్తాబు చేస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ బాల కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement