సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాల నియంత్రణకు సరికొత్త విప్తవం ఈ–4 అని సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ సిబ్బందికి శుక్రవారం డీసీపీ కృష్ణప్రసన్న సర్టిఫికెట్స్ అందచేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 25 వరకూ ఈ సెంటర్‌లో పోలీస్ అధికారులు, సిబ్బందికి సైట్రైన్ అనే అంశంపై మొట్టమొదటి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఐదు రోజులుగా కొనసాగిన ఈ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమంలో సైబర్ నేరాల స్వభావం, డిజిటల్ ఫొరెన్సిక్స్, సాంకేతిక విచారణలో పాటించాల్సిన వ్యూహాలు, ఆధునిక టూల్స్ వినియోగంపై అభ్యర్థులకు క్షేత్రస్థాయి అవగాహన, కేసు స్టడీ, ఫైనల్ అసెస్ మెంట్ మొదలైన వాటిపై సమగ్ర శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సైబర్ కై మ్ డీసీపీ భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


