కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై కొండచిలువ కలకలం | - | Sakshi
Sakshi News home page

కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై కొండచిలువ కలకలం

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై కొండ చిలువ ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఫ్లై ఓవర్‌పై శుక్రవారం ఉదయం హఠాత్తుగా సుమారు 8అడుగుల పొడవు గల ఒక కొండచిలువ కనిపించింది. అది నెమ్మదిగా వెళ్తుండటాన్ని గమనించిన వాహనదారులు, బాటసారులు భయందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లో స్నేక్‌ కాచర్‌ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి దానిని సురక్షితంగా పట్టుకుని సంచిలో బంధించాడు. అయితే గుర్తు తెలియని వాహనం దాని పై నుంచి వెళ్లడంతో గాయాలపాలైన ఆ కొండ చిలువ నుంచి రక్తం కారుతోంది. దీంతో పట్టుకున్న కొద్దిసేపటికే మృతి చెందిందని మణికంఠ తెలిపాడు. కృష్ణానదికి వరద రావడంతో వరదలో కొట్టుకొచ్చి ఫ్లై ఓవర్‌ పైకి చేరి ఉండవచ్చని అందరూ చర్చించుకున్నారు.

కొనసాగిన

ప్రభుత్వ వైద్యుల నిరసన

లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు న్యాయపరంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో పాటు, పలు సమస్యలపై ప్రభుత్వ వైద్యులు చేపట్టిన నిరసన శుక్రవారం 25వ రోజు కొనసాగింది. ప్రభుత్వ వైద్యుల సంఘం – ఆంధ్రప్రదేశ్‌(జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో గత 25 రోజులుగా వైద్యులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకూ విధు లు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే 2016 యూజీసీ పీఆర్‌సీ బకాయిలు టీచింగ్‌ వైద్యులకు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే 30 సార్లు విన్నపాలు చేసినా, ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందన్నారు. అంతేకాక తాము పనిచేసిన కాలానికి అనుగుణంగా పీఆర్‌సీ బకాయిలు ఇవ్వ మని వినతి అందజేస్తే ఇవ్వడం కుదరదని ప్రభు త్వం చెప్పడం బాధాకరమైన విషయమని అసోసి యేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కౌశల్‌ క్విజ్‌లో పాల్గొనండి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): భారతీయ విజ్ఞాన మండలి, అప్‌కాస్ట్‌, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహించే కౌశల్‌ క్విజ్‌ ట్యాలెంట్‌ టెస్ట్‌–2026 పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌. చంద్రకళ తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో కౌశల్‌ క్విజ్‌ – 2026 రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్‌ ప్రతిభాన్వేషణ పోటీకి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం చంద్రకళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీలకు ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు 28న, తొమ్మిదో తరగతికి 29న, పదో తరగతి విద్యార్థులకు 30న పోటీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 15న జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించి, మొదటి, రెండు స్థానాలు రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీకి ఎంపికవుతాయని వివరించారు. వివిధ విభాగాల నిర్వాహకులు అరుణ, సీహెచ్‌బీవీ పద్మావతి, సతీ్‌ష్‌, ఓ.పిచ్చేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నీట మునిగిన

వరి పొలాల పరిశీలన

ఘంటసాల: ఘంటసాల కేవీకే పరిధిలోని గ్రామాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మునిగిన వరి పంటను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ వరిలో దుబ్బు చేసే దశ నుంచి పిలకలు వేసే దశలో ఉన్నట్లయితే ముంపు నీటిని వీలైనంత త్వరగా తీసేయాలన్నారు. నీరు పూర్తిగా బయటకు తీసి బూస్టర్‌ డోస్‌ కింద 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను ఎకరానికి వేసుకోవాలన్నారు. పొడ తెగులు వ్యాప్తి నివారణకు హక్సాకొనజోల్‌ 400 మి.లీ. లేదా వాలిడామైసిన్‌ 400 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్‌ 200 మి.లీ. చొప్పున కలుపుకుని ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement