ట్రస్టు కాదన్నా.. వినరేమమ్మా..! | - | Sakshi
Sakshi News home page

ట్రస్టు కాదన్నా.. వినరేమమ్మా..!

Aug 23 2026 5:32 AM | Updated on Aug 23 2026 5:32 AM

ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026 సాహిత్యం సమకాలీనమై ఉండాలి గోవా సీఎంకు స్వాగతం u8లో

న్యూస్‌రీల్‌

2.5 ఎకరాలసి.వి.రెడ్డి చారిటీస్‌ స్థలంపై కన్ను ఆ స్థలంలో ఆస్పత్రి నిర్మాణానికి తీవ్ర ప్రయత్నాలు మూడు నెలల క్రితమే తిరస్కరించిన ట్రస్ట్‌ బోర్డు ఈ సారి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు

దేవస్థానం నిర్లక్ష్య ధోరణి

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాహిత్యం సమకాలీనమై ఉండాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి అన్నారు. ‘రచ్చబండ చర్చల్‌’, ‘కలగూర గంప’ గ్రంథాల ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు.

గోవా సీఎం డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌కు శనివారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ పర్యటన కోసం ఆయన వచ్చారు.

జాతీయ పోటీల్లో ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మర్లకు పతకాలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న 52వ జూనియర్‌ జాతీయ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన పోటీల్లో జిల్లా స్విమ్మర్లు పతకాలు సాధించారు. బాలుర గ్రూప్‌–1బీ (అండర్‌– 16) 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఎం.యజ్ఞసాయి ప్రతిభ చూపి 4.07.21 సెకన్ల సమయంలో పూర్తి చేసి రజత పతకం సొంతం చేసుకు న్నాడు. అండర్‌–18 బాలికల విభాగంలో గ్రూప్‌–1ఏ 200 మీటర్ల బ్రెస్ట్‌స్టోక్‌ విభాగంలో ఎన్‌.పావని సరయు 2.42.95 సెకన్లలో పూర్తి చేసి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పతకాలు పొందిన స్విమ్మర్లను ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ అక్వాటిక్స్‌ అసోసియేషన్‌, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు, స్విమ్మర్లు అభినందించారు.

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వివిధ వివాదాలకు సత్వర, సామరస్య పూర్వక పరిష్కారం చూపడంలో మధ్యవర్తిత్వం కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. మీడియేషన్‌తోపాటు న్యాయ సేవల విషయంలో జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మీడియేషన్‌పై మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. కోర్టుల, ఇరుపక్షాల సమ్మతితో సమస్యను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందన్నారు. వివాదాల కంటే చర్చలతో పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చే ఓ మంచి సాధనం మధ్యవర్తిత్వమని వివరించారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినకుండా, ఇరుపక్షాల అభిప్రాయాలను విని పరస్పర అంగీకారంతో పరిష్కారం చూపేందుకు ఇది ప్రయోజనకారి అని పేర్కొన్నారు. వచ్చే వారంలో వివిధ శాఖల అధికారులతో పాటు మీడియేటర్లతో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామస్థాయి వరకు మీడియేషన్‌ సేవలను చేర్చే విషయంపైనా సమావేశంలో చర్చించారు. కొన్ని కేసుల విషయంలో సైకాలజిస్టుల సేవలు కూడా అవసరమనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. సమావేశంలో పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, మధ్యవర్తులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారి ఆస్తులకు రెక్కలు వస్తున్నాయి. దాత ఆశయానికి తూట్లు పొడుస్తూ వందల కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు రూ.కోట్ల విలువైన సత్రాలు, స్థలాలు, భూములను విరాళాలుగా సమర్పించారు. వాటిని ఇచ్చేటప్పుడే ఏ అవసరాలకు వాడాలో సంబంధిత పత్రాల్లో పొందుపరుస్తారు. అమ్మవారికి దాతలు సమర్పించిన స్థలాల్లో అనేకం విజయవాడలో, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. నగరంలో అతి ఖరీదైన వన్‌టౌన్‌ ప్రాంతంలో దేవస్థానానికి సి.వి.రెడ్డి చారిటీస్‌ కాటేజీలు ఉన్నాయి. దాత చుండూరు వెంకటరెడ్డి ఆలయానికి స్పమర్పించిన 2.5 ఎకరాల స్థలంలో ఈ కాటేజీలు ఉన్నాయి. ఇవి దేవస్థానానికి కూత వేటు దూరంలోనే ఉన్నాయి. 2008 నుంచి సి.వి.రెడ్డి చారిటీస్‌ను దేవస్థానం నిర్వహిస్తోంది. 2008కి ముందు ఈ స్థలంలో ఉన్న గోదాములు, వ్యాపార సముదాయాలను దేవస్థానం 2009 నుంచి 2013 సంవత్సరాల్లో ఖాళీ చేయించింది. 2014లో ఆ స్థలంలో సుమారు రూ.10 కోట్లతో కాటేజీలను నిర్మించింది. 2017లో అప్పటి దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వాటిని ప్రారంభించారు. రైల్వేస్టేషన్‌కు కూతవేటు, బస్టాండ్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 2.5 ఏకరాల స్థలాన్ని భక్తులకు దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనాచౌదరి సి.వి.రెడ్డి కాటేజీలను వంద పడకల ఆస్పత్రిగా మార్చాలనే ప్రతిపాదనను ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుల ముందు పెట్టడమే కాకుండా బోర్డు సమావేశంలో అజెండాగా పొందుపరిచారు. అయితే ఆ ప్రతిపాదనను ట్రస్టు బోర్డు తిరస్కరించింది. కొద్దికాలం మౌనం వహించి తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ వైపు నుంచి కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు సమాచారం. తిరుపతి తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చే దుర్గగుడికి స్థలాభావం వల్ల కాటేజీలు లేక వసతి కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రానున్న రెండేళ్లలో కీలకపాత్ర

2027లో గోదావరి పుష్కరాలు, 2028లో కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. రెండు ప్రముఖ నదులకు జరిగే ఈ పుష్కరాలకు దేశవిదేశాల నుంచి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా రాజమండ్రికి విచ్చేసే యాత్రికులు తప్పని సరిగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారు. విజయవాడ కేంద్రంగా జరిగే కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రెండు పుష్కరాలలో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న సి.వి.రెడ్డి చారిటీస్‌ కాటేజీలు భక్తులకు వసతి కల్పించడంలో కీలక పాత్ర వహిస్తా యనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ కాటేజీలను భక్తుల అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎం.యజ్ఞసాయి ఎన్‌.పావని సరయు

వన్‌టౌన్‌లోని సి.వి.రెడ్డి గెస్ట్‌ హౌస్‌

ఎంతో విలువైన సి.వి.రెడ్డి చారిటీస్‌ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దుర్గగుడి తొలి నుంచి విఫలమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తుల కోసం కాటేజీల నిర్మాణం చేపట్టినా సరైన గదుల నిర్మాణం జరగలేదు. భక్తులందరూ విశాలమైన హాళ్లలో నిద్రించేలా కాటేజీలను నిర్మించారు. దీంతో భక్తుల నుంచి ఆదరణ లభించలేదు. ఐదేళ్ల కిందట దుర్గగుడి పరిసరాల్లో ఒక్క ప్రైవేటు హోటల్‌ గానీ గదులు అద్దెకు ఇచ్చే భవనాలు కానీ లేవు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 20కి పైగా హోటళ్లు, గదులను అద్దెకు ఇచ్చే సత్రాలు వెలిశాయి. వన్‌టౌన్‌ పరిసరాల్లో సి.వి.రెడ్డి చారిటీస్‌ కాటేజీల స్థాయిలో పార్కింగ్‌ వసతి ఉన్న కాటేజీ మరొకటి లేదు. సరైన ప్రణాళికలతో సి.వి.రెడ్డి చారిటీస్‌ను అభివృద్ధి చేస్తే భక్తులకు మేలు కలుగుతుంది. సి.వి.రెడ్డి చారిటీస్‌ స్థలాన్ని దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు పాత సామాన్లు భద్రపరిచే గోడౌన్‌గా మార్చేశారు. సి.వి.రెడ్డి చారిటీస్‌ కాటేజీలను అభివృద్ధి చేసి సరైన రీతిలో ప్రచారం చేస్తే భక్తులకు అందుబాటు ధరలో గదులు లభించడమే కాకుండా దేవస్థానానికి ఆదాయం సమకూరుతుంది. దీనికి భిన్నంగా ఆస్పత్రి నిర్మాణం ప్రతిపాదన సరికాదని భక్తులు పేర్కొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. పాత ప్రభుత్వాస్పత్రి కిలోమీటర్‌ దూరంలోనే ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో ఈ ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆస్పత్రి పేరిట అమ్మ వారి ఆస్తులను అన్యాక్రాంతం చేయాలనే ఆలోచనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement