ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనకు జాతీయ స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనకు జాతీయ స్థాయి గుర్తింపు

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనకు జాతీయ స్థాయి గుర్తింపు నేడు ఐలా ఎన్నికలు ఆటోనగర్‌(విజయవాడతూర్పు): ఐలా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధి కారి దొరబాబు బుధవారం తెలిపారు. మొత్తం 1,183 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలను వెళ్లడిస్తామన్నారు. ఒక ఓటరు రెండు ప్యానళ్లలో నచ్చిన అభ్యర్థులకు ఆరు ఓట్లు వేయాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రి యను 50 సిబ్బందితో పాటు పోలీసులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఏటీఏ బలపరిచిన చైర్మన్‌ అభ్యర్థి ఎండీ ఇర్ఫాన్‌ ప్యానల్‌కు బ్యాలెట్‌లో 1వ నబరు, రెండో ప్యానల్‌ చైర్మన్‌ అభ్యర్థి అన్నె శివనాగేశ్వరరావుకు బ్యాలెట్‌లో రెండో నంబరు కేటాయించినట్టువివరించారు. ఈ నంబర్లను లాటరీ ద్వారా తీసినట్టు తెలిపారు. కరువు మండలాలను ప్రకటించాలి కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్‌ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మి కులు, వృత్తిదారులు, పేదలను ఆదుకోవాలని కోరారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా అర్హులైన కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులను గుర్తించాలని కోరారు. పంట వేసినా, వేయకుండా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని, దేవదాయ భూముల కౌలు రైతుల కౌలును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సన్న, చిన్నకారు, మధ్యతరగతి, కౌలు, రైతుమిత్ర, జేఎల్‌జీ గ్రూపుల రుణాలను రద్దు చేయాలని, కౌలు రైతులకు, కరువు బాధితులకు నెలకు రూ.10వేలు పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.బలరామ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానం ప్రకారం పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త చట్టం తీసుకురావాలని, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే ఈ–క్రాప్‌లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల సమస్యలు పరి ష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రంగారావు పాల్గొన్నారు. ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌లో మినహాయింపు కల్పించాలి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, సాంకేతిక ఆధారిత పరిపాలన ద్వారా చేపడుతున్న వినూత్న కార్య క్రమాలకు జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతినిధి బృందం నుంచి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందించడంతో ది కమర్షియల్‌ టాక్సెస్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భవనారి వెంకటేష్‌బాబు, కొప్పోలు సుధాకకరావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతినిధి బృందం ఏపీ ముఖ్యమంత్రితో, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఫైనాన్స్‌ పియూష్‌ కుమార్‌, చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఏపీ పరిపాలనలో అమలు చేస్తున్న వినూత్న సాంకేతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించడం రాష్ట్రానికి, వాణిజ్య పన్నుల శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాలను ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగిన ఉత్తమ పద్ధతులుగా జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతినిధి బృందం గుర్తించడం తమ శాఖకు లభించిన విశిష్ట గౌరవమని వివరించారు.

మచిలీపట్నంఅర్బన్‌: టెట్‌లో ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మినహాయింపులు కల్పించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష తప్పనిసరి చేయడంతో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) కృష్ణా జిల్లా శాఖ నాయకులు బుధవారం డీఈఓ యు.వి. సుబ్బారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ 2010లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2015లో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)కు చేసిన సవరణల నేపథ్యంలో సర్వీసులో కొనసాగేందుకు, ప్రమోషన్‌ పొందేందుకు కూడా టెట్‌ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. 2010వ సంవత్సరానికి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు సైతం టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూటీఎఫ్‌ కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.డి. షౌకత్‌ హుస్సేన్‌, బి.కనకారావు, గౌరవాధ్య క్షుడ జె.లెనిన్‌ బాబు, కార్యదర్శి రంగనాథ్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement