స్కీం వర్కర్లకు కనీస వేతనాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

స్కీం వర్కర్లకు కనీస వేతనాలివ్వండి

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతోందని, ప్రభుత్వ స్కీం లలో పని చేస్తున్న వారంతా మహిళలేనని, వారికి మాత్రం కనీసం వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కీమ్‌ల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే స్కీం వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిం దని, ఒక్క మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చించలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్‌ కిచెన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రవేశాన్ని విరమించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ, ఆశ, వీఓఏ, ఆర్పీ, మధ్యాహ్న భోజన పఽథకం, ఉపాధి హామీ పథకం వంటి వాటిల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు రూ. 26వేలు కనీసం వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్లకు కనీసం వేతనాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ. కమల మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఆశ వర్కర్ల పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీలకు 5 నెలల నుంచి వేతన బకాయిలు పెట్టడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్‌.సిహెచ్‌.సుప్రజ మాట్లాడుతూ మెనూ చార్జీలను పెంచాల్సింది పోయి స్మార్ట్‌ కిచెన్ల పేరుతో ఉన్న పనిని లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహంకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్‌కుమార్‌, గజలక్ష్మి, పి.జ్యోతి, ఎ.సుశీల, ఎ.ఉమాదేవి, కె. సుస్మిత, సైదమ్మ, ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎ.వెంకటేశ్వరరావు, డి.వి.కృష్ణ, డి. కాశీనాధ్‌, పిల్లి నరసింహారావు, కె.గోపాల్‌, ిసీహెచ్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

కె.సుబ్బరావమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement