ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు 27వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, శ్రీకృష్ణా ష్టమి వేడుకలు జరుగునున్నాయి. సకల శుభాల మాసం శ్రావణంలో అమ్మవారి ఆల యంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఆగస్టు 21న మూలవిరాట్‌ను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. 27వ తేదీ నుంచి పవిత్రోత్స వాలు ప్రారంభం కానున్నాయి. శ్రావణ మాసం నాల్గో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు.
21న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం
శ్రావణ మాసం రెండో శుక్రవారమైన ఆగస్టు 21వ తేదీన ఆలయంలో మూలవిరాట్‌ను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాల నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. పవిత్రోత్సవాల మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. సెప్టెంబర్ నాలుగో తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి ఎదుట భక్తులు ఆచరించొచ్చు. తొలుత ఆర్జిత సేవగా, అనంతరం ఉచితంగా వ్రతాలకు భక్తులను అనుమతిస్తారు. సెప్టెంబర్ నాలుగో తేదీన దుర్గగుడిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది.


