హోరెత్తిన నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన నిరసన గళం

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

హోరెత్తిన నిరసన గళం

న్యూస్‌రీల్‌

మెగా డీఎస్సీలో పద్ధతిగా అవినీతి

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన యువత, విద్యార్థులు స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు, అనర్హులకు టీచర్‌ ఉద్యోగాలపై ఆగ్రహం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

దగా డీఎస్సీ

సీబీఐతో విచారణ జరిపించాలి

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
దగా డీఎస్సీపై

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విద్యారంగం, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. నీట్‌ అవకతవకలపై ఢిల్లీలో జెన్‌ జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆందోళనల తరహాలో విజయవాడను నిరసనలతో హోరెత్తించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని, మంత్రి నారా లోకేష్‌ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల సాయి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బావాజీపేటలోని కూర్మయ్య వంతెన నుంచి ధర్నా చౌక్‌ వరకు ఈ ర్యాలీ సాగింది. డీఎస్సీ అభ్యర్థులు గంగదేవిపాడుకు చెందిన రోశిబాబు, నూజివీడుకు చెందిన రాణి పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. విద్యార్థులు, యువత ప్లకార్డులతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

డీఎస్సీలో కమీషన్ల పర్వం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యువత, విద్యార్థులే ఎక్కువగా నష్టపో యారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయడంలేదని విమర్శించారు. యువగళం పాద్రయాత్రలో యువతకు అన్నగా ఉంటానన్న నారా లోకేష్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలో లోకేష్‌ రాజీనామా చేయాలని రాష్ట్ర యువత, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. యువతకు న్యాయం చేయగలిగే ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్‌ సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ లోకేష్‌ చాలెంజ్‌లు విసరడం విడ్డూరంగా ఉందన్నారు.

మెగా పేరుతో దగా

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో యువతను దగా చేసిన ప్రభుత్వాన్ని యువత, విద్యార్థులు రోడ్డెక్కి నిలదీస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు నారా లోకేష్‌ బాధ్యతవహిస్తూ రాజీనామా చేసేవరకు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందంటే తప్పు జరిగినట్టే కదా అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్‌ జగన్‌ ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక లోకేష్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు జరిగాయని విమర్శించారు. నకిలీ పత్రాలతో, స్పోర్ట్స్‌ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై విద్యార్థి, యువత రగిలిపోతోందని, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టంచేశారు.

మీ ఉద్యోగికి జాబ్‌ ఎందుకివ్వలేదు?

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ‘డీఎస్సీలో మీ ఉద్యోగికి ర్యాంకు వచ్చినా జాబ్‌ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే తప్పు చేసినట్టే కదా? అతడి నుంచి పేపర్‌ ఎవరికి లీక్‌ అయ్యిందో తేల్చాలి కదా? జీవోలు ఎందుకు మార్చారు? వీటన్నింటికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. లోకేష్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, ప్లేస్‌, టైం చెప్పాలని సూచించారు. తప్పు చేశారు కాబట్టే విచారణకు ఒప్పుకోవడం లేదన్నారు. కూటమి ధర్మం పాటిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జగ్గయ్య పేట, తిరువూరు నియోజకవర్గాల ఇన్‌చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, నలగట్ల స్వామిదాసు, విజయవాడ మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లా డుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్‌దే బాధ్యతని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఆసిఫ్‌, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నారా లోకేష్‌ అధికారంలోకి రాకముందు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి యువతలో ఆశలు కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. పద్ధతిగా మెగా డీఎస్సీ నిర్వహించామని లోకేష్‌ చెబుతున్నారు కానీ చాలా పద్ధతిగా అవినీతికి పాల్పడ్డారు. ఆయనకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు.

– కొరివి చైతన్య, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

కూటమి నాయకులు ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి దానికే మెగా డీఎస్సీ అని పేరుపెట్టారు. దానిని కూడా దగా డీఎస్సీ చేసి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగిస్తాం.

– కోమల సాయి, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్‌ కోటాలో టెట్‌ అర్హత, డిగ్రీ సర్టిఫికెట్‌ లేకుండా క్రీడా సంఘాల సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి. లేని పక్షంలో నీట్‌పై జెన్‌ జీ చేపట్టిన ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం.

– రవిచంద్ర, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement