ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

ఉత్కం

ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌

ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌ ● మంగళవారం జరిగిన మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. కాలికట్‌ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 66–26 గోల్స్‌ తేడాతో ‘కాలికట్‌’ విజయం సాధించింది. ● సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ, పూణే–హేమచంద్‌ యాదవ విశ్వవిద్యాలయం మధ్య జరిగిన పోటీలో 61–59 గోల్స్‌ తేడాతో ‘పూలే’ యూనివర్సిటీ గెలుపొందింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, కృష్ణా యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌ కూన రాంజీ, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్‌ జి. ఇన్యాసమ్మ పోటీలను వీక్షించి విజేతలను అభినందించారు. రసవత్తరంగా ఎడ్ల పూటీ లాగుడు పోటీలు రాజ్‌ కేసిరెడ్డి ఆస్తుల సీజ్‌కు సిట్‌ పిటిషన్‌

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని మేరీస్‌ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ నెట్‌బాల్‌(మహిళల)టోర్నమెంట్‌ ఉత్కంఠగా జరుగుతోంది. బుధవారం ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితో టోర్నమెంట్‌ ముగుస్తుంది.

ందిగామ రూరల్‌: దాములూరు సంగమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలను సర్పంచ్‌ గాదెల వెంకట రామారావు, ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా కల్యాణ ఉత్సవాల ముగింపు తర్వాత ఎడ్ల పూటీ లాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యూ జూనియర్‌ విభాగం పోటీల్లో తొమ్మిది జతల ఎడ్లు పాల్గొని ఆరుగురు వ్యక్తుల సాయంతో 1.5 క్వింటాళ్ల బరువును 10 నిముషాల వ్యవధిలో లాగాయని చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ లీగల్‌: మద్యం అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న రాజ్‌ కేసిరెడ్డితోపాటు, అతని పీఏ పైలా దిలీప్‌, అతని తల్లి సుహాసిని పేరిట కొన్న స్థిరాస్తులను సీజ్‌ చేయాలని న్యాయస్థానంలో సిట్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై పైలా దిలీప్‌, సుహాసిని తరఫున న్యాయవాది దిట్టకవి రామ్‌చంద్‌ మంగళవారం కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. రాజ్‌ కేసిరెడ్డి ఆస్తులకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను న్యాయమూర్తి ఈ నెల 20కి వాయిదా వేశారు.

ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌ 1
1/1

ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement