విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

విజయవ

విజయవాడ సిటీ

మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026 అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పర్యావరణానికి పెనుముప్పు కొరవడిన అధికారుల పర్యవేక్షణ!

న్యూస్‌రీల్‌

క్వారీల్లో తనిఖీలు చేస్తాం

ఆస్పత్రిలో కలెక్టర్‌ తనిఖీలు

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ఘనంగా గ్రాడ్యుయేషన్‌ వేడుకలు

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026

క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు

నిబంధనలను పట్టించుకోని వైనం

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ,

పోలీస్‌ శాఖల అధికారులు

కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలోని పలు క్వారీల్లో అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలు తూచ్‌ అంటూ కొండలను పిండి చేస్తున్నారు. భారీ రిగ్గులతో పేలుళ్లు జరుపుతూ గుల్లగుల్ల చేస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా, భద్రతా చర్యలు పాటించ కుండా సాగిస్తున్న బ్లాస్టింగ్‌లతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బ్లాస్టింగ్‌లకు అనుభవం లేని కార్మికులను వినియోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లీజుకు తీసుకున్న కొండలను అనుమతికి మించి తవ్వేస్తున్న అక్రమార్కులు సమీపంలోని అటవీ భూములను కొల్లగొడుతున్నారు. ఆ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంప దను దోచేస్తున్నారు. క్వారీల్లో జరుగుతున్న తవ్వకా లను తక్కువగా చూపించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండిపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన కొందరు క్వారీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. కొండలను తవ్వి రూ.కోట్లలో అక్రమ సంపాదనకు తెరదీశారు. కొంత మంది అధికారులకు ముడుపులు చెల్లించి వారి అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంపదను దోచేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ ప్రాంతంలో సర్వే నంబర్‌ 801లో 1,204 ఎకరాల్లో రాతి క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల సమీపంలో విస్తారంగా కొండ పోరంబోకు భూమి ఉంది. ఆ పక్కనే కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఆ ఫారెస్ట్‌లో పలు రకాల జంతువులు, పక్షులు, అటవీ సంపద ఉంది. ఈ కొండల్లో గత ప్రభుత్వాలు 74 మందికి లీజులు మంజూరు చేశాయి. అయితే కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. అయితే ఈ అక్రమాల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

కొండరాళ్లను పిండి చేసేందుకు రెండో క్వాలిటీ జిలెటిన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. పేలుళ్ల సమయంలో భారీ శబ్దాల కారణంగా కొండ పల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జంతువులు, పక్షులు ఆందోళనకు గురవుతున్నాయి. కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న సమయంలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికా రులు అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంబందిత అధికారు లకు కాంట్రాక్టర్లు ముడుపులు అందించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

7

దొనబండ క్వారీల్లో తనిఖీలు చేస్తాం. ప్రభుత్వం ఎంత మేరకు ఏఏ యజమానులకు అనుమతులు ఇచ్చింది, అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? ప్రభుత్వం కేటాయించిన క్వారీల్లోనే తవ్వ కాలు జరుపుతున్నారా? లేదా? అన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. అనుమతులు లేని క్వారీలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అక్రమంగా తవ్వకాలు జరిపితే క్వారీలను సీజ్‌ చేయటం ఖాయం.

– సీహెచ్‌ నరసింహారావు

తహసీల్దార్‌, కంచికచర్ల

మైలవరం: స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ పటమటకు చెందిన కోనేరు బాబూరావు, విజయకుమారి దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు.

గన్నవరంరూరల్‌: మండలంలోని చినఅవుట పల్లిలో ఉన్న సిద్ధార్థ దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి.

విజయవాడ సిటీ1
1/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/6

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement