నేరాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రస్తుతం సైబర్ నేరాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. నేరస్తులు ఏ రూపంలో మోసం చేయాలని చూసినా, అవగాహనతో మెలుగుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇతర నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. మద్యం తాగి వాహనాలు నడిపితే, తన ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. ఎన్టీఆర్‌జిల్లా కమిషనరేట్‌లో సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. నేరస్తులను గుర్తించడంలోనూ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది.
– ఎస్.వి.రాజశేఖరబాబు,
పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా


