దుర్గగుడికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు విశాఖపట్నానికి చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన వంగ పండు తిరుపతి, సత్యవతి దంపతులు ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. బెంగళూరుకు చెందిన మద్దూరి శ్రీనివాసరావు, వీర వెంకట శ్రీలక్ష్మి దంపతులు సాన్వి, షైవి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, సిబ్బంది అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మచిలీపట్నంటౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో రూపొందించిన 2026వ సంవత్సర టేబుల్ క్యాలెండర్‌ను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఉద్యోగులందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. మంత్రి రవీంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పి. రాము, జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్, కోశాధికారి బి.సురేష్, నాయకులు పవన్, సలీం, శ్రీనివాస రావు, సముద్రేశ్వరరావు, ఎస్.వి.వి.రామారావు, కోటేశ్వరరావు, కె.లోకేష్, ప్రవీణ్, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, హుస్సేన్, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా రాష్ట్రంలో డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు జరిగిన 19వ జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారని ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసో సియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్ బుధవారం తెలిపారు. మిక్స్‌డ్ టీమ్ విభా గంలో పి.వి.చిన్హాస్, ఎన్.క్రిష్ ధరణ్‌రెడ్డి, ఎస్.ఈశ్వర హితేష్, ఎ.ఎస్.వైశాలి, టి.సత్యశ్రీ, డి.ఆలియాతో కూడిన జట్టు స్వర్ణ పతకం సాధించిందన్నారు. మిక్సిడ్ డబుల్స్ విభా గంలో పి.వి.చిన్హాస్, ఎ.శ్రీ వైశాలి జోడి రజత పతకం సాధించిందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ అభినందించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరా అధికారి(డీఎస్‌ఓ)గా ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేసిన ఎ.పాపారావును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సత్కరించారు. గాంధీనగర్ లోని విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో పాపారావు సన్మాన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ ఆయనను శాలువాతో సత్కరించారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పౌర సరఫరాల డీఎం టి.వి.సతీష్, పలువురు జిల్లా అధికా రులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గగుడికి విరాళాలు
దుర్గగుడికి విరాళాలు
దుర్గగుడికి విరాళాలు


