ఆరోగ్యానికి తొలిప్రాధాన్యం
నూతన సంవత్సరం సందర్భంగా తీసుకునే నిర్ణయాల్లో ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలు గుతాం. ప్రస్తుతం జీవనశైలి వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. అవి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నిత్యం వ్యాయామం చేయడం, ఆహార నియమాలు పాటించడం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవర్చుకోవాలి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది వత్తిడికి గురవుతున్నారు. వత్తిడి లేని జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. వ్యాధులపై ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలి.
– డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ వైద్యులు


