ఉన్నతంగా ఎదగాలి
అందుబాటులో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ నూతన సంవత్సరంలో ఉన్నతులుగా ఎదిగేందుకు అడుగులు వేయాలి. అందుకు మేమంతా అండగా ఉంటాం. నూతన సంవత్సరంలో ఫలితాలు, ఉత్తమ విలువలు సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. నూరు శాతం లక్ష్యాలు సాధించడంతో పాటు, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న విజయాలను సాధించవచ్చు. పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే కచ్చితంగా ఉత్తమ మార్కులు సొంతం అవుతాయి.
– వై.చంద్రకళ, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి


