మన వారసత్వ ఆరోగ్య సంపద ఆయుష్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రాచీన వైద్య విధానం మన వారసత్వ సంపదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఆయు ర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్)పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి, వాటిని సద్విని యోగం చేసుకునేలా ప్రోత్సహించా లని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వివిధ పనులపై వచ్చే సందర్శకులకు వైద్యాధికారులు ఆయుష్ విశిష్టతపై అవగాహన కల్పించారు. కొందరిని పరీక్షించి, ఔషధాలు అందించారు. కలెక్టర్ లక్ష్మీశ ఈ సెల్‌ను సందర్శించి ఆయుష్ వైద్యులకు వివిధ సూచనలు చేశారు. జిల్లాలో ఏడు ఆయుష్మాన్ మందిర్‌లు, ఆరు ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయన్నారు. విజయవాడలో డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నాయని, వాటిద్వారా మెరుగైన సేవలు అందించేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. ఆరోగ్య ఆంధ్ర సాధనలో ఆయుష్ విభాగం కూడా కీలకపాత్ర పోషించా లని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్న ప్రియదర్శిని, డాక్టర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


