జి.కొండూరు: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చెవుటూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే ... చెవుటూరు గ్రామానికి చెందిన గూడూరు బలరామిరెడ్డి(35) కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో టెక్నిషియన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టెక్నీషియన్‌గా చేరక ముందు పలు వ్యాపారాలు చేసి అప్పులు చేశాడు. అప్పులు భారమై తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇటీవల మద్యం తాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి బలరామిరెడ్డిని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గూడూరు శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. మృతుడుకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


