ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

Nov 24 2025 8:17 AM | Updated on Nov 24 2025 8:17 AM

ఉత్సా

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

మ్యాథ్స్‌పై భయం తగ్గింది.. ఇంగ్లిష్‌ను ఎలా చదవాలో తెలిసింది పరీక్షలంటే భయం పోతుంది..

నైపుణ్యాలు పెరుగుతాయి..

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం సంపాదించేలా చేయడంతో పాటుగా మ్యాథ్స్‌ సబ్జెక్టుపై ఉన్న భయాన్ని దూరం చేసేందుకు సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పిన్నమనేని పాలి క్లినిక్‌ రోడ్డులో ఉన్న నలంద విద్యానికేతన్‌ పాఠశాల ఆవరణలో స్పెల్‌ బీ క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌, మ్యాథ్‌ బీ సెమీ ఫైనల్‌ రౌండ్‌ పరీక్షలు ఆదివారం జరిగాయి. విద్యార్థులు వారు చదువుతున్న తరగతులను బట్టి మొత్తం 4 కేటగిరీలుగా విభజించి ఈ పరీక్షలను నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో..

స్పెల్‌ బీ పరీక్షలో కేటగిరీ–1లో 135, కేటగిరీ–2లో 196, కేటగిరీ–3లో 320, కేటగిరీ–4లో 193 మంది పరీక్షకు హాజరయ్యారు. మ్యాథ్‌ బీ పరీక్షలో కేటగిరీ–1లో 92, కేటగిరీ–2లో 112, కేటగిరీ–3లో 140, కేటగిరీ–4లో 135 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 1,323 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు మెయిన్‌ స్పాన్సర్‌గా డ్యూక్స్‌ వాఫేతో పాటుగా రాజమండ్రిలోని ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వ్యవహరించాయి.

లెక్కలపై ఉన్న భయం కొంత తగ్గింది. లెక్కలను సులభతరంగా ఎలా చేయాలనే విషయంపై ఈ మ్యాఽథ్‌ బీ పరీక్షకు హాజరు కావడం వల్ల కొంత అవగాహన ఏర్పడింది. పరీక్షను చాలా బాగా రాశాను.

– అభిషేక్‌, 2వతరగతి,

షామ్‌రాక్‌ స్కూల్‌

స్పెల్లింగులను ఎలా చదవాలో తెలిసింది. ఇంగ్లిష్‌ భాష మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు సైలెంట్‌ అవుతాయి. ఆ పదాలు ఏవీ అనే విషయంపై అవగాహన ఏర్పడింది. ఎన్నో కొత్త పదాల స్పెల్లింగులను తెలుసుకున్నాను.

– ఆహిల్‌ ఫర్హాన్‌, 5వ తరగతి,

కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌

ఇలాంటి పరీక్షలకు విద్యార్థులు హాజరు కావడం వల్ల వారికి పరీక్షలపై ఉన్న భయం పోతుంది. దాని వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాస్తారు. పరీక్షకు ప్రిపేర్‌ అయ్యే సమయంలో సబ్టెక్టుపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం లభిస్తోంది.

– కె.ప్రసాద్‌రెడ్డి, విద్యార్థి తండ్రి

పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు

ఇలాంటి పరీక్షలకు విద్యార్థులు హాజరవడం వల్ల వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. పాఠశాలలో రాసే పరీక్షలకు ఇలాంటి పోటీ పరీక్షలకు మధ్య తేడా ఉంటుంది. ఇది వారి భవిష్యత్తుకు బాగా ఉపకరిస్తుంది.

– పి.కుమారి, విద్యార్థి తల్లి

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’1
1/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’2
2/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’3
3/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’4
4/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’5
5/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’6
6/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’7
7/7

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement