ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌ల్లో గుర్తుతెలియని మృతదేహం పోలీసులకు లభించింది. స్టేజ్–2 గేటు వద్ద మృతదేహాన్ని గుర్తించిన సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రాంబాబు బుధవా రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ బి.అనూష ఘటన స్థలంలో మృతదేహాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మృతుని ఎత్తు ఐదు అడుగులు, వయస్సు సుమారు 35–40ఏళ్ల మధ్య ఉంటుంది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలిసిన వారు ఎస్‌హెచ్‌వో 94406 27084, ఎస్‌ఐ 93906 81266 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
కృష్ణా నదిలో..
చందర్లపాడు (నందిగామ): కృష్ణానదిలో గుర్తుతెలియ ని ఓ మహిళ మృతదేహాన్ని బుధవారం చందర్లపాడు పోలీసులు గుర్తించారు. ఎస్సై ఆర్.ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం చందర్లపాడు మండలం రామన్నపే ట గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో ఉన్న పంపింగ్ స్కీం వద్ద నీటిలో పూర్తిగా నాని పోయి ఉన్న మృతదేహాన్ని స్కీం వద్ద పని చేసే సిబ్బంది గుర్తించారు. వెంటనే చందర్లపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదే హం కృష్ణా నదిలో ఎగువ ప్రాంతంనుంచి కొట్టుకు వ చ్చినట్లుగా గుర్తించారు. మృతురాలి వయసు సుమా రు 35నుంచి 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. మృతురాలి శరీరంపై నీలిరంగు చీర, జాకెట్‌తోపాటు ఎర్ర గాజులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నీటిలో పూర్తి గా నాని పోయిందన్నారు. కేసు నమోదు చేసి అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారమిచ్చినట్లు ఎస్సై తెలిపారు.