టీటీఏ ఆ‍ధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు | Sakshi
Sakshi News home page

టీటీఏ ఆ‍ధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు

Published Sat, Dec 16 2023 10:51 AM

Telangana Telugu Association Serve Government Schools With Digital Classrooms - Sakshi

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ టీటీఏ సేవాడేస్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసురూమ్‌లు ఏర్పాటు చేసింది. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో మయూర్ రెడ్డి బండారు 25 పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్ సామాగ్రి అందించారు.

ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన టీటీఏ సభ్యులకు చిన్నారులు సాగర స్వాగతం పలికారు. టీటీఏ బృందం ఇచ్చిన ప్రోత్సాహానికి పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు టీచర్లను సన్మనించి, మెమంటోలు అందించారు. 

Advertisement
 
Advertisement