సింగపూర్‌లో కురిసిన రామాయణ ప్రవచనామృతం | Ramayana pravachaman by dr Medasani Mohan in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో కురిసిన రామాయణ ప్రవచనామృతం

Aug 12 2025 2:37 PM | Updated on Aug 12 2025 2:45 PM

 Ramayana pravachaman by dr Medasani Mohan in Singapore

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" (sri smakrithika kalasarathi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో, పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజుల ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

సింగపూర్ దేశపు నాలుగు మూలల నివసించే తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా 5  వేర్వేరు వేదికలలో 5 భాగాలుగా, 15 గంటలపాటు మొత్తం రామాయణంలోని 7 కాండలు , రామాయణ ప్రాశస్త్యంపై సోదాహరణంగా  డా. మేడసాని మోహన్ ప్రవచించారు.

5 వేదికలలోనూ సుమారు 250 మంది తెలుగువారు పాల్గొనగా 'సింగపూర్ తెలుగు టీవీ'వారి సాంకేతిక నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఆన్లైన్ ద్వారా దాదాపుగా 2000 మంది పైగా వీక్షించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటినుండి తెలుగు పద్యములు కూడా ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమైన ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను కూడా రామాయణ గాథతో మేళవించి, పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా మేడసానివారు తమ ప్రవచనం అందించారు.

ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి  రాజ్యలక్ష్మి దంపతులు డాక్టర్ మేడసాని మోహన్ గారికి ఆతిథ్యమీయగా, మొదటి వేదిక పంగోల్ రివర్వెల్ కాండోలోను, రెండవ వేదిక బర్గండీ క్రెసెంట్ లోను,  మూడవ వేదిక మెల్విల్ కాండోలోను, నాలుగవ వేదిక క్యాన్బర్రా కాండోలోను, 5వ వేదిక జూబిలీ రోడ్ లోను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వేదికలతో పాటు  7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా జరిగింది. 15వ తేదీ రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం సుసంపన్నం అవుతుంది.

"సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి ఈ సభలకు వ్యాఖ్యానం చేయగా, ప్రొ. బి వి ఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి  సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజశ్వని దంపతులు ఈ 5 వేదికల ఏర్పాటలో సహకరించారని, మరి ఎంతో మంది దాతలు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిని వారందరికీ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అయిదువేదికలలో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి,  శ్రీధన్వి, షర్మిల చిత్రాడకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement