'ఆఫ్‌ బీజేపీ' న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు | OFBJP Celebrates BJP Led NDA Victory In New Jersey | Sakshi
Sakshi News home page

'ఆఫ్‌ బీజేపీ న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు

Published Fri, Jun 14 2024 6:13 PM | Last Updated on Fri, Jun 14 2024 6:19 PM

OFBJP Celebrates BJP Led NDA Victory In New Jersey

అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో  సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అమెరికన్‌ కమ్యూనిటీ జరుపుకుంది. ఆఫ్ బీజేపీ అమెరికా (OFBJP-USA ) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆఫ్‌ బీజేపీ. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజెపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల భారత సంతతి అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమానికి దాదాపు 800 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉత్సాహభరితమైన డోల్‌ తాషా ప్రదర్శనలు, ఎన్నారైల నృత్యాలతో ప్రారంభమయ్యింది. బీజేపీ విజయానికి గుర్తుగా ఉత్సాహన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలన్నీ ఆనందభరితంగా సాగాయి. దీనికి వ్యాఖ్యాతగా జ్యోత్స్న వ్యవహరించారు. ఆఫ్‌ బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు డా. అడపా ప్రసాద్‌ ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. ముచ్చటా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చారిత్రక విజయాన్ని హైలెట్‌ చేశారు. 1962 తర్వాత తొలిసారిగా వరసగా మూడోసారి ప్రజలు బీజేపీకే అధికారం కట్టబెట్టారని అన్నారు. 

ఈ మేరకు ఆఫ్‌ బీజేపీ వాసుదేవ్‌ పటేల్‌ మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధానంతరం వరుసగా మూడోసారి ఎన్నికైన నాయకుడు నరేంద్ర మోదీనే అని, ప్రతిసారి స్థిరమైన ఓట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డుని నెలకొల్పారని కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, బీజేపీతోపాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ప్రశంసించారు.

డా. సుధీర్ పారిఖ్, శ్రీ ఆల్బర్ట్ జెస్సాని,పీయూష్ పటేల్ బీజేపీ ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. అఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ /అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎంపీ సీట్ల కోసం అమెరికాలో అన్ని తెలంగాణ ఆఫ్‌ బీజేపీ కమిటీ చాఫ్టర్లు కలిసి కట్టుగా 12 ఎంపీ జూమ్‌ కాల్స్‌, ఫోన్‌ కాల్‌ కాంపెయిన్‌, సోషల్‌ మీడియాలో వీడియోలు, ఛాయ్‌ పే చర్చలు, గ్లోబల్‌ క్యాలాథన్‌, గ్లోబల్‌ ఛాయ్‌ పే చర్చలు, యజ్ఞాలు/హామములు లాంటివి చేసి 17 ఎంపీలలో ఎనిమిది వచ్చేలా కృషి చేశారని వివరించారు. 

అలాగే రాబోయే 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం చరణ్‌ సింగ్‌ గారు ఉత్తర ప్రదేశ్‌ కోసం, అమర్‌ గోస్వామి గుజరాత్‌ కోసం కారు ర్యాలీ లాంటివి చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుధీర్ పరేఖ్,  జయేష్ పటేల్, పీయూష్ పటేల్, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు సహా న్యూజెర్సీ అంతటా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, మా రాజ్యలక్ష్మి, దీప్తి జానీ, సంతోష్ రెడ్డి,  గణేష్ రామకృష్ణన్, మధుకర్ రెడ్డి, శివదాసన్ నాయర్,  జయశ్రీ,  గోవిందరాజ్, ఓంప్రకాష్ నక్క, జగదీష్ యలిమంచిలి,  ప్రవీణ్ తడకమళ్ల , రఘు రెడ్డి,  రామ్ వేముల,  శరత్ వేముల,  విజయ్ కుందూరు, శ్రీనివాస్ గనగోని, శ్రీకాంత్ రెడ్డి, పృధ్వి, రవి పెద్ది, నాగ మహేందర్, మధు అన్న, భాస్కర్, దాము గాదెల, ప్రవీణ్ గూడూరు, సుధాకర్ ఉప్పల, మృధుల,లక్ష్మీ మోపర్తి,  గురు ఆలంపల్లి,  గోపి, తదితర కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు .

(చదవండి: అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement