పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు | NATS awareness seminar on good touch and bad touch in Palasa | Sakshi
Sakshi News home page

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

Mar 18 2025 4:34 PM | Updated on Mar 18 2025 4:34 PM

NATS awareness seminar on good touch and bad touch in Palasa

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. 

మరిన్ని NRI  వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి! 

ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement