దుబాయ్‌ తెలుగు సంఘం అధ్యక్షుడిగా హైదరాబాద్‌ వాసి

Dubai Telugu Association New President Elected - Sakshi

దుబాయ్ తెలుగు అసోసియేషన్ కి కొత్త కార్యవర్గం

దుబాయిలోని తెలుగు ప్రజల సామాజిక సంక్షేమ మరియు సాంస్కృతిక విభాగాలను, అలాగే అసోసియేషన్ నడిపించడానికి జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ మరియు డైరెక్టర్లను ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. ఎలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్‌ సహా,  వైస్‌ చైర్మన్‌, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థాపక సభ్యుల ప్రతినిధులు నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా హైదరాబాద్ నగరానికి చెందిన బాలుస వివేకానంద ఎన్నికయ్యారు. ఎన్నికల్లో కొత్తగా నియమితులైన బోర్డు సభ్యులు వీళ్లే..

1. ఛైర్మ న్ - వివేకానింద్ బలుసా
2. వైస్ చైర్మ న్ – సుదర్శన కటారు
3. ప్రధాన కార్యదర్శి –విజయ భాస్కర్‌
4. కోశాధికారి- శ్రీనివాస్‌ గౌడ్‌
5. ఎమిరాటీ బోర్డు సభ్యులు - మిస్టర్‌ రాషెడ్, మిసర్ట ఖలీద్
6. డైరెక్టర్లు(AP) - షేక్ అబ్దదల్ ఫహీమ్ ,లతా నగేష్
7. డైరెక్టర్లు(TS) -భీమ్ శింకర్, చైతనా చకినాల
8. డైరెక్టర్లు(FM) – మసియుద్ధీన్‌ మహమ్మద్‌, శ్రీనివాస్‌ రావు యెండూరి, సురేంద్రనాథ్‌ ధనేకుల, శ్రీధర్‌

ఈ ఎన్నికల్లో 100% ఓటింగ్ నమోదు కావడం గొప్ప విశేషం. ఇప్పటివరకు యూఏఈ దేశంలో జరిగిన ఏ ఎన్నికలతో పోల్చినా దుబాయ్ తెలుగు అసోసియేషన్ లో జరిగిన పోలింగే అత్యంత ఎక్కువ. దుబాయిలో నివసించే వేరువేరు తెలుగు ప్రజలను వేర్వేరు వృత్తుల్లో ఉన్న తెలుగు ప్రజలు అలాగే వేర్వేరు నమ్మకాలు కలిగి ఉండి , వేర్వేరు కార్యక్రమాలు చేపట్టే ప్రజలందరినీ ఒక తాటిపై తేవడమే దుబాయ్ తెలుగు అసోసియేషన్ లక్ష్యం.

దుబాయ్ తెలుగు అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్థిరపడ్డ ప్రవాసాంధులు చాలామంది ఆసక్తి చూపించారు. ఈ ఎన్నికల నిర్వహణను ఒక ప్రొఫెషనల్ ఎలక్షన్ కమిటీ పర్యవేక్షించింది. అత్యంత పకడ్బందీగా ఈ ఎన్నికలను నిర్వహించింది. విదేశాల్లో ఉన్న దుబాయ్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు కూడా నిర్వహించింది.  కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద దుబాయ్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం ఈ తెలుగు అసోసియేషన్ వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ అసోసియేషన్ పూర్తిగా అధీకృత చట్టపరమైన సంస్థ.

దుబాయ్ తెలుగు అసోసియేషన్‌కు ఎన్నికైన కొత్త కార్యవర్గం తెలుగు ప్రజల ఆశలకు అనుగుణంగా, అలాగే తెలుగు ప్రజలకు అండగా, వారి విజయానికి దోహదపడుతుందని దుబాయ్ సమాజానికి సేవ చేస్తుందని కొత్త కార్యవర్గం తెలిపింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top