భారతీయులకు స్వాగతం.. సింగపూర్‌ కొత్త ఆదేశాలు

Double Vaccinated Indians Can Enter Singapore Without Quarantine - Sakshi

Singapore Gives Green Signal To Indians Entry: కోవిడ్‌ ప్రభావం తగ్గుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్‌ ప్రభుత​‍్వం అనుమతులు జారీ చేస్తోంది. 

నవంబరు 29
రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండోనేషియా, ఇండియా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన ప్రజలు తమ దేశానికి రావచ్చంటూ సింగపూర్‌ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, ఇండియాలకు చెందిన పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు. డిసెంబరు 6 నుంచి సౌదీ పౌరులకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఇక పెద్దవాళ్లతో ప్రయాణం చేసే పన్నెండేళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్‌ తీసుకోపోయినా తమ దేశంలోకి రావచ్చని సింగపూర్‌ ప్రకటించింది. డబుల్‌ వ్యాక్సిన్‌ తీసుకుని తమ దేశంలోకి వస్తున్నందున ఎటువంటి క్వారంటైన్‌ నిబంధనలు పాటించనక్కర్లేదని పేర్కొంది.

విమానాలు రెడీ
కరోనా విపత్తు మొదలైన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు రద్దయ్యాయి. కోవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో బాగా నష్టపోవడంతో సింగపూర్‌ అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు చేసింది. కాగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబుతుండటంతో నెమ్మదిగా ఒక్కో దేశానికి చెందిన పౌరులకు అనుమతులు జారీ చేస్తోంది. మరోవైపు విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునరుద్ధరించే పనిలో ఉన్నాయి.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top