న్యూయార్క్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Diwali Celebrations Held In New York City - Sakshi

తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్( TLCA) దీపావళి వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. న్యూయార్క్‌లోని క్రాన్సాఫ్ థియేటర్ వేదికగా తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి వేడుకలు కన్నుల పండగ్గా జరిగాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నాంటాయి. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు, పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది.

వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని పలువురు కొనియాడారు. TLCA సభ్యులు అందరికీ దీపావళి  శుభాకాంక్షలు అందజేశారు. TLCA చేస్తున్న పలు కార్యక్రమాలకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. గత 10 ఏళ్లుగా మీడియా రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహబలుడు హనుమంతుడుని ఘనంగా సన్మానించి.. మెమొంటొలతో సత్కరించారు.

 ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. మణిశర్మ తన ట్రూప్ తో కలిసి మ్యూజిక్‌తో అందరినీ ఎంటర్‌టైన్‌ చేశారు. సింగర్స్  వైష్ణవి, శృతిక, స్వరాగ్, పవన్ తదితరులు సూపర్ హిట్ పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. నటి స్పందన పల్లి ఫ్యాషన్ వాక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, Raffles బహుమతులు, మెహందీ, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అసాంతం ఉత్సాహంగా సాగాయి. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top