నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌లతోపాటు డీఆర్‌వో గీత, డీఆర్డీవో సాయ న్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు అడిషనల్ కలెక్టర్లు సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణి..
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 33 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ సాయిచైతన్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
ధర్పల్లి: డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలంగాణ ప్రాంతీయ ముఖ్య అధికారి ప్రభాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, టెలికాం, బ్రాడ్ కాస్టింగ్‌పై ట్రాయ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కల్పించారు. టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ సేవలో వినియోగదారులకు ఉండే హక్కులను వివరించడంతోపాటు నకిలీ కాల్స్, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎస్సై సందీప్, సర్పంచ్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, టెలికాం కంపెనీల ప్రాంతీయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన పరిశీలన
బోధన్ రూరల్ : మండలంలోని పెంటాకలానన్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను యూపీఎస్సీ ట్రెయినీ అధికారులు సోమవా రం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అమలు తీరును పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలకు సంబంధించిన వివరాలను హెచ్‌ఎం భూమయ్య అప్పతో మాట్లాడి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ (మల్టీ–టచ్ స్మార్ట్ డిస్‌ప్లే బోర్డులు) ప్యానెల్స్ పనితీరు, డిజిటల్ వి ద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. వారివెంట సర్పంచ్ కర్ణం కళావతి, నాయకులు కర్లం నాగరాజు, ఉప సర్పంచ్ నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
జిల్లాకు నలుగురు ట్రెయినీ డీఎస్పీలు
నిజామాబాద్‌అర్బన్: శిక్షణలో భాగంగా జి ల్లాకు నలుగురు డీఎస్పీలు వచ్చారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కా ర్యాలయానికి చేరుకున్న ట్రెయినీ డీఎస్పీలు కే వర్షితరెడ్డి, సుదీప్‌రెడ్డి, శివరామానందం, టి జకప్‌అభిషేక్ సీపీ సాయిచైతన్యను కలిశారు. ఈ సందర్భంగా సీపీ.. కమిషనరేట్ పరిధిలో పోలీసు పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు తదితర అంశాలను వివరించారు.


