డిచ్‌పల్లి/నిజామాబాద్‌రూరల్ : రైతాంగానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు పనులను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యమని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. డిచ్‌పల్లిలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్‌పీఎం షెడ్‌ను సీఎండీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మరింత వేగంగా సేవలందించేందుకు డిచ్‌పల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. డిచ్‌పల్లి డివిజన్ పరిధిలోని మోపాల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మత్తుల కోసం దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. సంస్థ పరిధిలో ఇది మూడో డిపార్ట్‌మెంటల్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రం కాగా, దీనిని అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
పులాంగ్ సబ్‌స్టేషన్ పనులు..
నిజామాబాద్ నగరంలోని పులాంగ్ రైతు బజార్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను సీఎండి వరుణ్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, నిర్మాణ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.మధుసూదన్, చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్స్) అశోక్‌కుమార్, ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావు, డీఈ (ఎంఆర్టీ అండ్ కన్స్‌స్ట్రక్షన్) వెంకటరమణ, అధికారులు హరిచంద్ర, మహమ్మద్ ముక్తార్, రఘు, ఏడీఈలు కే. నటరాజ్, అశోక్, తోట రాజశేఖర్, సాయితేజ, ఏఈలు గంగారాం, లక్ష్మణ్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ ఆఖరులోపు పులాంగ్ ఇండోర్ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేయాలి
టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్‌రెడ్డి
డిచ్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్
ఎస్‌పీఎం షెడ్ ప్రారంభం


