విచారణ పేరిట
నిజామాబాద్‌అర్బన్: విచారణ పేరిట కొందరు ఎస్‌బీ కానిస్టేబుళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌పోర్ట్‌ల వ్యవహారాల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరి వ్యవహార శైలి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం స్తూ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్లు తెలిసింది. గతంలో బోధన్ కేంద్రంగా వెలుగుచూసిన నకిలీ పాస్‌పోర్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. కొందరు ఎస్‌బీ అధికారులు రోహింగ్యాలకు ఎలాంటి ఆధారాలు లేకుండానే పాస్‌పోర్ట్‌లకు క్లియరెనన్స్ జారీ చేశారు. ఈ వ్యవహారంలో 20 నుంచి 30 మంది అక్రమంగా పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం తర్వాత మళ్లీ కొందరు విచారణ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఓ మండలంలో స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారు. పాస్‌పోర్ట్ విచారణలో భాగంగా ఓ గ్రామ శివార్లకు వెళ్లి కారులో ఉండి సంబంధిత వ్యక్తులను అతడి వద్దకే పిలిపించుకోవడం, కారులో కూర్చుని వ్యవహారాలను చర్చించడం జరుగుతోంది. చిన్నపాటి తప్పులను చూపుతూ.. డబ్బులు తీసుకొని సక్రమం చేస్తానని వసూళ్లకు పాల్పడుతున్నాడు. సదరు కానిస్టేబుల్ ఒక్కో పాస్‌పోర్ట్ విచారణకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయిల్‌కు వెళ్లే ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.2వేలు వసూలు చేసి.. ఆ తరువాత విచారణ పేరుతో మరోసారి రూ.వేయి వసూలు చేసినట్లు తెలిసింది. కానిస్టేబుల్ వ్యవహారశైలి ఉన్నతాధికారులకు తెలిసి హెచ్చరించినట్లు సమాచారం. గత నెల రోజుల క్రితం ఓ వ్యక్తి బహ్రెయిన్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందులో చిరునామా ఓచోట, వ్యక్తి ఉండేది మరో చోట కావడంతో అతడిని భయబ్రాంతులకు గురిచేసి రూ.5వేలు వసూలు చేసినట్లు సమాచారం. మండల కేంద్రంలో ఉండే ఓ వ్యక్తి చిరునామా గు ర్తింపు కార్డుల్లో వేర్వేరుగా ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకొని వసూలు చేసినట్టు తెలిసింది. ఇలా సంబంధిత మండలంలో ప్రతిరోజూ విచారణ పే రుతో వసూళ్ల పర్వం సాగుతోందని స్థానికులు వా పోతున్నారు. ప్రతి విచారణకు డబ్బులు ఇవ్వందే పనికావడం లేదంటున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో భవిష్యత్‌లో కూడా పాస్‌పోర్ట్ రాకుండా చేస్తానని కానిస్టేబుల్ భయపెడుతున్నాడని అంటున్నారు.
జిల్లా కేంద్రంలోనూ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీ వల ఎంఐఎం నాయకులు పోలీస్ కమిషనర్‌ను కలిసి విన్నవించినట్లు తెలిసింది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే విచారణకు వచ్చే అధికారులు ఇంటి యజమాని ధ్రువపత్రాలు అందజేయాలని అంటున్నారని, యజమానులు పత్రాలు ఇవ్వకపోతే డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు తిప్పలు
డబ్బులిస్తే చిరునామాకు వెళ్లకుండానే ఎంకై ్వరీ పూర్తి
అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి
ఇబ్బందులు అనేకం


