చనిపోయిన వారి స్థానంలోనే కొత్త పెన్షన్‌లు | - | Sakshi
Sakshi News home page

చనిపోయిన వారి స్థానంలోనే కొత్త పెన్షన్‌లు

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

● ఆధారాలతో నిరూపిస్తా..

తప్పుంటే రాజీనామా చేస్తా

● మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలో చనిపోయిన వారి స్థానంలోనే కొత్త పెన్షన్లు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించా రు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం 2023 డిసెంబర్‌ నాటికి జిల్లాలో 2,79,177 మందికి నెలకు రూ. 2 వేల చొప్పున పెన్షన్‌ అందుతోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మరణాలు ఇతర కారణాలతో 17,131 మంది పేర్లను పెన్షన్‌ జాబితా నుంచి తొలగించారని, కొత్తగా 20,555 మందికి పెన్షన్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో అదనంగా ఇచ్చింది 3,424 మాత్రమే అన్నారు. భీమ్‌గల్‌ మండలం బెజ్జోర గ్రామంలో 22 పెన్షన్లను తొలగించి 13 మందికి పెన్షన్లు ఇచ్చారన్నారు. దీనికి పెన్షన్‌ల పండుగ పేరుతో ఫ్లెక్సీలు కట్టడం విడ్డురంగా ఉందన్నారు. లెక్కలతో సహా పెన్షన్ల వివరాలను చూపిస్తానని, తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు. జిల్లాలో 3.20 లక్షల మంది వృద్ధులు, బీడీ కార్మికులు మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాకే గ్రామాల్లోకి రావాలన్నారు. నాయకులుబాజిరెడ్డి జగన్‌, నూడ మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, దండు శేఖర్‌, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, సత్యప్రకాష్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement