సాగర్‌ నీటిని రెండో పంటకు విడుదల చేయిస్తా | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ నీటిని రెండో పంటకు విడుదల చేయిస్తా

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

వర్ని: నిజాంసాగర్‌ ఆయకట్టు కింద రైతులు వేసిన పంటలను కాపాడేందుకు సీఎంతో మాట్లాడి ప్రాజె క్టు నుంచి నీటిని విడుదల చేయిస్తానని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని, చందూర్‌, మోస్రా మండల కేంద్రాల్లో చేయూత పింఛన్‌ లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్‌ మంజూరు కాకపోతే స్థానిక ఎంపీడీవోకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, విచారణ అనంతరం అర్హులకు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

వర్నిలో పోచారం మాట్లాడుతూ.. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వేసవిలో తాగు అవసరాలకు పోను మిగిలిన నీటిని సీఎంతో మాట్లాడి పంటలు ఎండకుండా విడుదల చేయిస్తా నని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పంటలు ఎండనివ్వబోనని రైతులకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపుల కారణంగా యువకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, వెంటనే వాటిని ఎత్తేయాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను పోచారం ఆదేశించారు. బెల్ట్‌షాపుల కారణంగా చాలా గ్రామాల్లో ఉదయం నుంచే మ ద్యం సేవిస్తున్నారని, మద్యం మత్తులో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ప్రాణాలను కాపాడటానికి బెల్ట్‌ షాపులను ఎత్తివేయాలని, అవసరమైతే తాను గ్రామాల్లోకి వచ్చి అండగా ఉంటానన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ మాజీ చైర్మన్‌ కాసుల బాలరాజు, వర్ని ఏఎంసీ మాజీ చైర్మన్‌ సురేశ్‌బాబా, మాజీ ఉపాధ్యక్షుడు వెలగపూడి గోపాల్‌, పీసీసీ డెలిగేట్‌ రాజిరెడ్డి, వర్ని సొసైటీ మాజీ అధ్యక్షుడు వీర్రాజు, తహసీల్దార్‌ ప్రశాంత్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌, సత్యనారాయణపురం సర్పంచ్‌ కనకదుర్గ రవి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

పంటలు ఎండకుండా

సాగునీటిని విడుదల చేస్తాం

గ్రామాల్లో బెల్ట్‌ షాపులను

ఎత్తివేయండి

ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement