● అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి
వర్తింపజేస్తాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
మాక్లూర్: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వర్తింపజేస్తామని, ప్రజలు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నుంచి జీవిత బీమా ప్రారంభం కానున్న నేపథ్యంలో మాక్లూర్ మండల కేంద్రంలోని జీపీ భవనంలో ఏర్పాటు చేసిన నమో దు సెంటర్‌ను కలెక్టర్ బుధవారం పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను ప్రవేశపెట్టిందన్నారు. ఆధార్, రేషన్‌కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబంలో ఒక్కరికే బీమా వర్తిస్తుందని, 59 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి అందుబాటులో ఒక సెంటర్ ఉంటుందన్నారు. ఆహార భద్రత కార్డులో పేరు లేనివారు కూడా ఆధార్‌కార్డుతో బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ప్రత్యేక అధికా రిణి కృష్ణవేణి, ఇన్చార్జి డీపీవో నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శేఖర్, సర్పంచ్ ఎస్ వెంకటేశ్వర్రావు, విండో చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ సర్పంచ్ అన్నబోయిన రాజేందర్ ఉన్నారు.


