నాగిరెడ్డిపేట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారంలో బుధవారం రాత్రి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మేసెజ్‌లు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆన్లైన్ పెట్టుబడులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు వివరాలు, ఏటీపీల గురించి చెప్పవద్దన్నారు. యువత మాదకద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై అగస్త్య భార్గవ్‌గౌడ్, సర్పంచ్ ప్రభుగౌడ్, ఉపసర్పంచ్ స్వరూప, గ్రామపోలీస్ అధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జంగంపల్లిలో..
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. సైబర్ నేరాల విషయమై టోల్ ఫ్రీ నంబర్ 1930, మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నంబర్ 1908, షీటీమ్ కోసం 8712686094 నంబర్లను సంప్రదించాలన్నారు. కళాజాత బృందం ప్రతినిధులు రామంచ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, రాజేందర్, ఏఎస్సై వెంకట్రావు, హెచ్ఎం బాలచారి, విద్యార్థులు పాల్గొన్నారు.


