● డీసీసీ అధ్యక్షుడు కే నగేశ్‌రెడ్డి
డిచ్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ముల్లంగి(ఐ) గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. గత ప్రభుత్వం నిరుపేదలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. సమావేశంలో సర్పంచ్ సూదం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సీహెచ్ నర్సయ్య, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ అశోక్, నాయకులు మధుసూదన్ రెడ్డి, బున్నె రవి, గంగారెడ్డి, సాయికుమార్, వీడీసీ సభ్యులు రవి, మల్లేశ్, గంగారాం, సుదర్శన్, నారాయణ, సాయిలు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


