ఇటలీ నేత జియాకోమోపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇటలీ నేత జియాకోమోపై కేసు నమోదు చేయాలి

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

● సీపీకి ఎమ్మెల్యే ధన్‌పాల్‌ ఫిర్యాదు

సుభాష్‌నగర్‌: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం భారత్‌ సమ్మిట్‌ పేరుతో ఇటీవల నిర్వహించిన సదస్సులో ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌ చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ కోరారు. ఈమేరకు సీపీ సాయిచైతన్యను బుధవారం కలిసి ఫిలిబెక్‌పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విదేశీయుడైన జియాకోమో తన ప్రసంగంతో వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్‌ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తిగా విచారణ చేపట్టాలన్నారు. ఆయన ప్రసంగంలో ‘ఓటు చోర్‌.. గద్దీ చోడ్‌’ అనే నినాదం చేసి భారత అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చెప్పడం తగదన్నారు. తగు చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement