బోధన్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూప్‌నకు చెందిన భారతి సిమెంట్ ఎదుగుతున్నదని, వికాట్ గ్రూప్ కంపెనీస్ ప్రపంచంలో 12 దేశాలలో విస్తరించి ఉన్నాయని ఆ సంస్థ డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ మీర్జా తెలిపారు. బుధవారం బోధన్ పట్టణ కేంద్రంలో కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్నికల్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తి అవుతుందని, ప్రీమియం క్వాలిటి ఉంటుందని వివరించారు. భారతి సిమెంట్ సర్వీస్ చాలా వేగవంతంగా ఉంటుందన్నారు. సమావేశంలో డీలర్ జహీర్ రజా, రాయల్ ట్రేడర్స్ నిర్వాహకులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లాలోని చందూర్, మునిపల్లి ఎంజేపీ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో సత్యనాథ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చందూ ర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లిష్, తెలు గు, బొటనీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటి క్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, మునిపల్లి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్టెక్టులలో మాస్టర్స్ డిగ్రీతో పాటు 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. నీట్, సెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 21న మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లో ఎంజేపీలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. డెమో క్లాస్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అన్నారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్‌లో ఉన్న లింబాద్రిగుట్ట లక్ష్మీనృసింహస్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్ తెలిపారు. బుధవారం ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, మండల అధికారులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతర ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. గతేడాది జాతరలో విజయవంతమైన వన్ వే ట్రాఫిక్ విధానాన్నే ఈసారి కూడా అమలు చేయనున్నట్లు సీఐ తెలిపారు. లింగాపూర్ చౌరస్తా మీదుగా వాహనాలు వచ్చి భీమ్‌గల్ వైపు వెళ్లేలా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈసారి టోల్ విధానం ఉండదని, భక్తులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం ప్రత్యేకంగా నాలుగు పార్కింగ్ లాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ భద్రతా చర్యలు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్, తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, ఎస్సై చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బాలల దినోత్సవం
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్యాన్సీ, డ్రెస్, ఫుడ్ ఫెస్టివల్, ఆర్ట్‌అండ్ కల్చర్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఎల్లయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాల నళినీ దేవి, ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు హన్మాండ్లు, పాఠశాల ఉపాధ్యాయినీ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కారును ఢీకొన్న లారీ
మాక్లూర్: మండలంలోని మాణిక్‌బండార్ శివా రు ఆర్టీసీ కాలనీ వద్ద రహదారిపై బుధవారం కారును మక్కల లారీ ఢీకొన్నది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. లారీ డ్రైవర్‌తో ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది.
రెండు బైకులు ఢీకొని ఒకరికి
తీవ్ర గాయాలు
మాక్లూర్: మండల కేంద్రంలోని నందిపేట రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరి కాళ్లు చేతులు విరిగాయి. స్థానికులు గాయపడ్డ వ్యక్తులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మాక్లూర్ పోలీసులు తెలిపారు.


