విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఇందల్వాయిలో కొనసాగుతున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతి గృహాల నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజన పదార్థాల నాణ్యతను ప్రతిరోజూ పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్‌, ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, అధికారులు పాల్గొన్నారు.

కేజీబీవీ తనిఖీ

మాక్లూర్‌: మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. వంట గది, స్టోర్‌ రూంలో సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొన్ని రోజులుగా నిత్యావసరాలలో కొన్ని రకాల సరుకులను కాంట్రాక్టర్‌ పంపకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్పెషల్‌ ఆఫీసర్‌ కలెక్టర్‌ దృష్టికి తేగా, విద్యా శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులను అందజేయించారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థినులకు నీట్‌ కోచింగ్‌ అందిస్తుండడంపై కలెక్టర్‌ అభినందిస్తూ, అత్యధిక మందికి ప్రవేశాలు లభించేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కేజీబీవీ విద్యార్థినులతో కలెక్టర్‌ భేటీ అయ్యారు. వారికి పలు ప్రశ్నలు వేస్తూ అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్‌, ఎంఈవో సత్యనారాయణ, కేజీవీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ స్రవంతి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement