క్యాంపస్‌ కబుర్లు | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ కబుర్లు

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

25న తెయూలో ‘సంవిధాన్‌ ఉత్సవ్‌–2026’

తెయూ(డిచ్‌పల్లి): తెయూలో ఈ నెల 25న ఎన్‌ఎస్‌యూఐ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్‌ 25న ‘సంవిధాన్‌ ఉత్సవ్‌–2026’ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ కమిటీ అధ్యక్షుడు గూడూరి అరుణ్‌తేజ తెలిపారు. ఈ మేరకు బుధవారం తెయూ రిజిస్ట్రార్‌ యాదగిరి తో కలిసి సంవిధాన్‌ ఉత్సవ్‌ –2026 కరపత్రం ఆవిష్కరించారు. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రెండు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెయూ లా కళాశాల సెమినార్‌ హాల్‌లో ఈ నెల 25న వ్యాసరచన, క్విజ్‌ పోటీలు ఉంటాయన్నారు. తెయూ ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి జటావత్‌ రాజు, ఈవెంట్‌ కోఆర్డినేటర్‌ జీ శ్రావ్య, ఉపాధ్యక్షులు కే గౌతమ్‌రాజ్‌, కార్యవర్గ సభ్యులు ఎస్‌ కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలోని డిగ్రీ 5, 7వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య జీ చంద్రశేఖర్‌ తెలిపారు. తెయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 4,200 మందికి 4,072 మంది హాజరు కాగా 128 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

పుస్తకాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయి

తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఆంగ్ల విభాగం లైబ్రరీకి కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం(వరంగల్‌) విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు దామోదర్‌ రావు బుధవారం విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా తెయూ ఆర్ట్స్‌ డీన్‌ మూసా ఖురేషీ మాట్లాడుతూ.. పుస్తకాలు విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి, పరిశోధనా దృక్పథానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం దామోదర్‌రావును ఆంగ్ల విభాగం తరఫున ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి పీ సమత, వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ చక్రవర్తి, బీవోఎస్‌ చైర్మన్‌ కేవీ రమణాచారి, అధ్యాపకులు ఎల్‌ జ్యోత్స్న, ఎన్‌ స్వామిరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement