సిరికొండ: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సడాక్ నగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 విభాగంలో హాకీ టోర్నమెంట్ నిమిత్తం ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అఖిల, పల్లవి, రూపిక, అఖిల, చికిత, స్రవంతి, రక్షిత ఎంపికై నట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించే టోర్నీలో వీరు పాల్గొంటారని అన్నారు. విద్యార్థినులను సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఎంఈవో రాములు, ఇన్చార్జి హెచ్ఎం మనోహర్, ఉపాధ్యాయులు అభినందించారు.


