అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

నేడు కామారెడ్డి బల్దియా సర్వసభ్య సమావేశం దరఖాస్తుల ఆహ్వానం

రుద్రూర్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతంగల్‌, కోటగిరి, రుద్రూర్‌ మండల కేంద్రాల్లో మంగళవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పింఛన్‌ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పోతంగల్‌ మండలానికి 447, కోటగిరి మండలానికి 356, రుద్రూర్‌ మండలానికి 369 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఆగ్రోస్‌ ఇండసీ్ట్రస్‌ మాజీ చైర్మన్‌ కాసుల బాలరాజు, ఆర్డీవో విజయకుమారి, డీఆర్డీవో సాయన్న, సర్పంచులు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ఈనెల 13న వాయిదా పడిన కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు బల్ది యా అధికారులు తెలిపారు. బుధవారం ఉద యం 11 గంటలకు కౌన్సిల్‌ హాలులో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని పేర్కొన్నా రు. అయితే ఈసారైనా సమావేశం సజావుగా సాగుతుందా లేదా షరామామూలుగానే మళ్లీ వాయిదా పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అవినీతి, వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలపై కౌన్సిల్‌ సభ్యులు పాలకవర్గాన్ని నిలదీసే అవకాశాలున్నాయి.

కామారెడ్డి టౌన్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ద రఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి డీఎంహెచ్‌వో వెంకట్‌ తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.500లని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్హతలు, ఇతర నిబంధనల కోసం www.kamareddy. telangana.gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

● ప్రభుత్వ సలహాదారు

పోచారం శ్రీనివాసరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement