రీ సర్వేలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

● అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి

● అధికారులు సమన్వయంతో పని చేయాలి

● సమీక్షాసమావేశంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ భూముల రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇనన్‌స్పెక్టర్లు, సర్వేయర్లతో భూముల రీ సర్వేపై మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. మండలాల వారీగా రీ సర్వే పురోగతి, చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించిన సమయంలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సభల ద్వారా భూ యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. రీ సర్వే సమయంలో భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలు, వారి సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, సంబంధిత శాఖల అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement