ఏడో బెటాలియన్‌ ‘ఏ’ కంపెనీలో వార్షిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఏడో బెటాలియన్‌ ‘ఏ’ కంపెనీలో వార్షిక తనిఖీ

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడవ బెటాలియన్‌ ‘ఏ’ కంపెనీ లో మంగళవారం కమాండెంట్‌ బీ సీతారాం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ పరిధిలోని కార్యాలయాలు, బ్యారక్స్‌, మెస్‌, స్టోర్స్‌, ఆయుధాగారం, తదితర విభాగాలను కమాండెంట్‌ పరిశీలించారు. ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, సిబ్బంది క్రమశిక్షణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఏ కంపెనీ సిబ్బందితో కవాతు, కిట్‌ ఇన్‌స్పెక్షన్‌, కంపెనీ డ్రిల్‌, వెపన్‌ ట్రైనింగ్‌ నిర్వహించారు. కమాండెంట్‌ కంపెనీ సిబ్బంది విధుల నిర్వహణ, సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తత, క్రమశిక్షణ, సమయపాలనతో పాటు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ‘ఏ’ కంపెనీ ఇన్‌చార్జి రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement