సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

డొంకేశ్వర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): డొంకేశ్వర్‌ను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి, ఎంపీడీవో బూక్య లింగం, తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సారెస్పీలో సమృద్ధిగా నీరు లేకపోవడంతో ముంపు గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందన్నారు. పక్కనున్న నందిపేట్‌కు కరువు మండలంగా ప్రకటించి, డొంకేశ్వర్‌ను ప్రకటించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు సంజీవ్‌రాజ్‌, సర్పంచులు గంగాధర్‌, రాజారెడ్డి, ప్రకాశ్‌, చిన్నారెడ్డి, భూమన్న, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

నేడు నూతన చేయూత మంజూరు పత్రాల పంపిణీ

రుద్రూర్‌: కోటగిరి, పోతంగల్‌ మండలాల కొత్త ఫించన్‌ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్టు వివిధ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్‌కుమార్‌, పుప్పాల శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోతంగల్‌లో ఉదయం 9.30 గంటలకు, కోటగిరిలో 10.30 గంటలకు, రుద్రూర్‌లో మధ్యా హ్నం పంపిణీ చేయనున్నట్టు వారు వెల్లడించారు.

వర్ని మండల సభ

వర్ని: వర్ని మండల సమావేశం ఈ నెల 17న 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు నివేదికలతో సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.

ఉచిత ప్రైమరీ పాఠశాల ప్రారంభం

మాక్లూర్‌: చిన్న పిల్లల కోసం ఆలూర్‌ మండలం గుత్ప గ్రామంలో సోమవారం ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎంఈవో నరేందర్‌ ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ కొండ్ర కమల దశరథ్‌, ఉప సర్పంచ్‌ సూర చిన్నారెడ్డి, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు దృపతికుమార్‌, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర్‌, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు జిందం శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల అన్నారు. సోమవారం భీమ్‌గల్‌ పట్టణంలోని శుభోదయం పాఠశాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకల్లో ఏపీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. దివ్యాంగుల సీసీ సుమలత, సీనియర్‌ సీసీలు పురస్తు నరేష్‌, వర్ణం శ్రీనివాస్‌, మండల అకౌంటెంట్‌ గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

అంక్సాపూర్‌ హైస్కూలులో

స్వయం పరిపాలన దినోత్సవం

వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ కింది తరగతుల వారికి పాఠాలు బోధించారు. వీరిని హెచ్‌ఎం మల్లీశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

మోతె లైబ్రరీని సందర్శించిన మాజీ డీఈవో

వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం మోతె ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక లైబ్రరీని మాజీ డీఈవో దుర్గాప్రసాద్‌ సోమవారం సందర్శించారు. అందులో పుస్తకాలను పరిశీలించారు. లైబ్రరీ రిజిస్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. స్కూలు ఆవరణ పరిశుభ్రంగా ఉంచడం సంతోషం కలిగించిందన్నారు. లైబ్రరీ దాత అల్లపుల్ల గంగారెడ్డిని అభినందించారు. ఆయనను హెచ్‌ఎం వైద్య గణేష్‌ శాలువాతో సన్మానించారు.

బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డుల ప్రదానం

రెంజల్‌: మైనర్‌ సేప్టి అండ్‌ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉత్తమ విద్యార్థులను గుర్తించి బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డులను అందించారు. సోమవారం నీలా హైస్కూల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 18 ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసిన సంస్థ నిర్వాహకులు అవార్డులను ప్రదానం చేశారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు షేక్‌ సోను, లక్ష్మణ్‌, సాయితేజ, పాఠశాల హెచ్‌ఎం ఆదినారాయణ, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సోమలింగంగౌడ్‌, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా మల్లన్న స్వామి కల్యాణోత్సవం

కమ్మర్‌పల్లి(ఏర్గట్ల): ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో సోమవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామి దేవాలయంలో మల్లన్న స్వామి కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరై తిలకించారు. నాయకులు రాజాపూర్ణానందం ఉన్నారు.

ఆలయ మడిగెలకు బహిరంగ వేలం

ఆర్మూర్‌ టౌన్‌: పట్టణంలోని జంబి హనుమాన్‌ ఆలయ ఆవరణలో గల మడిగెలకు సోమవారం ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో వేలం పాట నిర్వహించారు. 10 దుకాణాలకు బహిరంగ వేలం చేపట్టారు. ఈ వేలంలో ఐదుగురు డిపాజిట్‌ చెల్లించి పాల్గొనగా,మూడు మ డిగెలు మాత్రమే వేలం పాటలో దక్కించుకున్నారు. దేవాదా య శా ఖ పరిశీలకులు సుజా త, ఆలయ ఈవో కులకర్ణి రఘునాథ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ రేగుళ్ల సత్యనారాయణ, ధర్మకర్తలు దోండి రమ ణ, నూతల నారాయణరెడ్డి, చిక్యాల న వీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement