మాక్లూర్: ప్రజల నాయకుడు అగ్గు ఎర్రన్న సంతాప సభ వాల్ పోస్టర్‌ను సోమవారం మండలంలోని బోర్గాం(కె)లో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి దేశెట్టి సాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 22న మోపాల్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే సంతాప సభకు ముఖ్య అథిదులుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు, తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సాయిరె డ్డి కోరారు. నాయకులు బన్సీ, రాధ, సిర్రం శంకర్, సాయిలు, బాలమణి పాల్గొన్నారు.
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన పలువురు బాధిత కుటుంబాలను బీజేపీ నాయకులు సోమవారం పరామర్శించారు. బీజేపీ నాయకుడు జక్కం గోపి తండ్రి ఇటీవల మరణించడంతో అతనిని, రోడ్డు ప్రమాదంలో మరణించిన పిప్పెర శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయకులు లింగాగౌడ్, నవీన్, ఆరేపల్లి నర్సయ్య, కాల రవి, కొత్తింటి రాకేశ్ పాల్గొన్నారు.


