● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్/నందిపేట : రాష్ట్రంలో పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడింది తానేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఆనాడు అసెంబ్లీ ఆవేదనతో మాట్లాడితేనే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని, ఇప్పుడు పేదల కళ్లలో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. సోమవారం డొంకేశ్వర్, మాక్లూర్, నందిపేటలలో ఏర్పాటు చేసిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు మంజూరు చే స్తోందని, పెన్షన్ మంజూరు కాని వారు అధైర్య పడవద్దన్నారు. ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చా రు. త్వరలోనే తొండాకూర్–నూత్పల్లి, జీజీ నడ్కు డ–చిన్నయానం రోడ్డు పనులను శంకుస్థాపన చేస్తామన్నారు. అన్నారం, జీజీ నడ్కుడ, సిర్పూర్ గ్రా మాలకు సబ్ స్టేషన్ సమస్యను పరిష్కరించాలని ట్రాన్స్‌కో ఏఈ రమేశ్‌కు సూచించారు. డొంకేశ్వర్ లో మండల ప్రత్యేకాధికారి కృష్ణ, ఎంపీడీవో బుక్య లింగం, తహశీల్దార్ ప్రసాద్, సర్పంచులు .. మాక్లూర్‌లో పార్టీ మండల అధ్యక్షులు మదారి మమత, సీ నియర్ నాయకులు గోవూరి ఒడ్డెన్న, సత్యం, రాజేందర్‌రెడ్డి, అనిల్ కులకర్ణి, సర్పంచ్‌లు.. నందిపేటలో ఎంపీడీవో శ్రీనివాసరావు, వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
భీమన్న గుడికి ఎమ్మెల్యే విరాళం
మాక్లూర్: ధర్మోరాలో కొత్తగా నిర్మించిన భీమన్న ఆలయానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సోమవారం రూ.51 వేల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును స్థానిక సర్పంచ్ పందిరి శ్రీనివాస్‌కు అందజేశారు. భీమన్న ఆలయంలో విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించటానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆహ్వాన పత్రాన్ని అందించేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో నాయక్‌పోడ్ కులస్తులు సోమవారం అంకాపూర్లోని ఆయన స్వగృహానికి వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తన వంతుగా విరాళం అందజేశాారు. ఉప సర్పంచ్ గొల్ల నగేష్, పుట్ట గంగాధర్, వార్డు సభ్యులు సుంకరి భూమేష్ పాల్గొన్నారు.


