రుద్రూర్: రైతులను అయోమయానికి గురిచేసి నష్టపరిచే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ హితవు పలికారు. మండల కేంద్రంలో సోమవారం వారు మాట్లాడా రు. ఎల్‌నినో ప్రభావం కారణంగా సాగునీటితో పాటు తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కనీస అవగాహన లేకుండా బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. నేతలు పత్తి రాము, కర్క అశోక్, నిసార్, వడ్ల నరేష్, అమంద్ వెంకటేష్, దువ్వ రవి, గౌస్, గాండ్ల శ్రీనివాస్, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


