రుద్రూర్: మూడు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు.సోమవారం సీఐటీయూ ఆఽ ద్వర్యంలో రుద్రూర్ మండల ప్రజావాణి కార్య క్రమంలో కార్మికులు వినతిపత్రం అందజేశా రు. మూడు నెలలుగా బిల్లును రాకపోతే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఎక్కడి నుండి పె ట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జి ల్లా నాయకుడు నన్నేసాబ్, కార్మికులు ఇస్మా యిల్,రేఖ,లక్ష్మి,జుబేదా తదితరులు పాల్గొన్నా రు.అలాగే రుద్రూర్ మండలంలోని కొందాపూ ర్ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటిలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్ని: మోస్రా మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు షేక్ హైమద్, మాదారపు రామ్‌రెడ్డి, తూర్పు కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం దేవనన్పల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డిజైనర్ రాక్, జంబో రాక్ పేర్లతో క్వారీలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో గ్రానైట్ కోసం తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ తవ్వకాల వల్ల గ్రామంలో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం దేవన్‌పల్లి గ్రామస్తులు భీమ్‌గల్ పట్టణంలోని సుదర్శన్టాకీస్ చౌరాస్తా నుంచి ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదు చేశారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పట్టణంలోని ఆరో వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే మురికి కాలువల నిర్మాణ పనులకు ము న్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి సోమవా రం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో కొత్తగా మురికి కాలువలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్, వైస్ చైర్పర్సన్ చంటి లత, కౌన్సిలర్లు శ్రీజ, తోట సతీష్, అంజుమ్ అలీ, సందీప్, సంగ్యా నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స అ నంతరావు, కాంగ్రెస్ నాయకులు చెప్ప గణేష్, మొండి దినేష్, తదితరులు పాల్గొన్నారు.
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఈ నెల 12న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు 55 నుంచి 60 ఏళ్లు గల మహిళ అపస్మారకస్థితిలో ఉండడాన్ని గమనించారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59778, 87126, 59870 నెంబర్లకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్ గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్(37) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్టోబర్ 28న రోడ్డు ప్రమాదంలో మరణించారు. 20 రోజుల అనంతరం ఆయన మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య అరుణ, కూతురు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబసభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు.
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని భవానీనగర్‌లో సోమవారం పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితు డు శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. తన భార్య పుట్టింటికి వెళ్లగా, తాను ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిన ట్లు తెలిపారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు చైన్, 27 తులాల వెండి అపహరించారు. సాయంత్రం ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉండగా, ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నట్లు తెలిపారు. బాల్కొండ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.


