● ముప్కాల్ క్రీడలకు పురిటిగడ్డ
● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్(ముప్కాల్): క్రీడలతోనే విద్యార్థుల్లో మానసిక ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ముప్కాల్ మండల కేంద్రంలో బాల్కొండ, ముప్కాల్ ఉమ్మడి మండలాల 70వ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ముప్కాల్ గ్రామం కబడ్డీ ఆటకు ఎంతో ప్రసిద్ధి చెందిందని, గంగారెడ్డి, వెంకట్‌రెడ్డి వంటి ఎందరో క్రీడాకారులు ఈ గడ్డపై నుంచే జాతీయస్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. క్రీడల్లో చురుకుగా ఉండే విద్యార్థులకు పరిపక్వత, గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించే వారే చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముంందుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్ర తిరోజు ఒక గంట మైదానాలకు పంపాలని, దాని ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎ దుగుతారని పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్దికి పారిశ్రామికవేత్త దయానంద్‌రెడ్డి కంప్యూటర్లు, డె స్క్ బెంచీలు, స్పోర్ట్స్ కిట్లు అందిస్తూ ఎంతో సేవ చే స్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముప్కాల్ సర్పంచ్ కుమ్మల సాయమ్మ శ్రీనివాస్, ఉపసర్పంచ్ చిన్నయ్య చారులత, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి, వెంకటేష్, వీడీసీ అధ్యక్షుడు రాజేశ్వర్, ఎంఈవో విష్ణుదేవి, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లి(ఏర్గట్ల): ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌లో కొలువైన మల్లన్న స్వామి దేవస్థానం అభివృద్ధికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించడంతో సోమవారం ఆలయ ప్రాంగణంలో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ మల్లన్న స్వామి వా రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మాజీ జెడ్పీటీసీ గుళ్ల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


