బోధన్: స్మార్ట్ రేషన్‌కార్డులో తప్పుగా నమోదైన పిన్‌కోడ్ నంబర్‌ను సవరించాలని కోరుతూ సోమవారం ఎడపల్లి మండల పరిషత్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జానకంపేట గ్రామ సొసైటీ మాజీ చైర్మన్‌లు మిద్దె నరేందర్, బండారి లక్ష్మణ్ ఎంపీడీవో శంకర్‌కు దరఖాస్తు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జానకంపేట గ్రామ పిన్‌కోడ్ నంబర్ 503186 బదులు 503307గా నమోదైందని తెలిపారు. అధికారులు సరి చూసుకోకుండా స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. తప్పు సరిచేయాలని కోరారు. ఎడపల్లి ప్రజావాణికి మూడు ఫిర్యాదులు వచ్చాయి.
సాలూర ప్రజావాణికి 3 ఫిర్యాదులు
బోధన్: సాలూరలో సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయి. ఎంపీడీవో బండారి నర్సయ్య ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలు శాఖల అధికారులు ప్రజావాణికి హజరయ్యారు.
కోటగిరి,పోతంగల్, రుద్రూర్‌లో 9 ఫిర్యాదులు
రుద్రూర్: కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండల కేంద్రాల్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. రుద్రూర్‌లో ఏడు, కోటగిరి, పోతంగల్‌లో ఒక్కొక్క ఫిర్యాదు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
వర్నిలో నిల్
వర్ని: వర్ని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు రాలేదని వర్ని ఎంపీడీవో వెంకటేశ్వర్ తెలిపారు. ఇదివరకు నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించినట్లు ఎంపీడీవో తెలిపారు.
దోమల బెడద నివారించాలని వినతి
నవీపేట: నవీపేట జీపీ పరిధిలోని 14, 16వ వార్డుల్లో నెలకొన్న దోమల బెడదను నివారించాలని వార్డు సభ్యులు సాయితేజ, ప్రేమ్ సింగ్‌లు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు. నెల రోజుల కిందట ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోలేదని, దోమల బెడదతో రోగాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


