ప్రత్యామ్నయ పంటల సాగుపై ఆసక్తి చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నయ పంటల సాగుపై ఆసక్తి చూపాలి

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ఆర్మూర్‌ ఏవో హరికృష్ణ సూచించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావ్‌ అభియాన్‌లో భాగంగా యాసంగి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య మాట్లాడుతూ.. పసుపు పంటలో సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. హార్టికల్చర్‌ అధికారిణి సంధ్య, ఏఈవో రమ్య, సర్పంచ్‌ దేవేందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ తుకారం, రైతులు పాల్గొన్నారు.

అపరాలను సాగు చేయాలి

కమ్మర్‌పల్లి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి పంట కాకుండా ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేయాలని కమ్మర్‌పల్లి ఏవో రమ్యశ్రీ అన్నారు. సోమవారం బషీరాబాద్‌లో రైతులకు ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా రైతులకు అపరాల సాగుపై అవగాహన కల్పించారు. కస్టం, హైరింగ్‌, సెంటర్లు, ప్యాక్స్‌ లేదా ఎస్‌హెచ్‌జీ సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి రాయితీల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement