వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రూనగర్‌లో బోజిగోళ్ల గంగామణి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం స్థానిక సర్పంచ్ గాండ్ల రాజేశ్, కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కత్తిరించి గృహ ప్రవేశం నిర్వహించారు. మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, జీపీ కార్యదర్శి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు మహమ్మద్ యూనిస్, సంజీవ్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్, నవీన్, రియాజ్ అలీ, గడ్డం రవి, సాయిచరణ్‌తేజ, తదితరులు పాల్గొన్నారు.
లక్కోరలో ..
వేల్పూర్: లక్కోర గ్రామంలో జెల్లా రాజేశ్వర్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు సోమవారం రిబ్బన్ కత్తిరించి గృహ ప్రవేశం చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్, స్థానిక సర్పంచ్ దాసరి అపర్ణ, రిటైర్డు ఎంవీఐ ఉట్నూర్ సుభాష్, నాయకులు ముత్యాల ప్రవీణ్, సుజన్గౌడ్, జీపీ కార్యదర్శి విజయ్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.


